Nov 20,2023 20:10

ప్రచారం రథంపై నుంచి మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
'నీకు రాజకీయ భిక్ష పెట్టిందే టిడిపి. గుర్తు పెట్టుకో బాలనాగిరెడ్డి' అంటూ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మాధవరం గ్రామంలో వివాదం జరిగిన స్థలంలోనే మరో కట్టను కట్టారు. టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్‌ స్వామి అధ్యక్షతన టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైతన్య రథంపై నుంచి ఆయన మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యేను చేసిన టిడిపి జెండాకు వైసిపి రంగులు వేయడం తగునా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదిక కూల్చారని, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ టిడిపి జెండా కట్టకు వైసిపి రంగులు వేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయలేని వైసిపి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని విమర్శించారు. ధమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడదామని, లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని, ఎవరు గెలుస్తారో చూద్దామని సవాలు విసిరారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు నీరందించి మెప్పు పొందాలని, ప్రతిపక్ష నేతలపై దాడులు, జెండా కట్టల విషయంలో తగాదా పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. నియోజకవర్గానికి 5 సాగునీటి ప్రాజెక్టులకు గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, వాటిని ప్రారంభించలేక పోయారని తెలిపారు. నియోజకవర్గంలో రైతులు, కూలీలు వలస వెళ్తున్నారని, నివారణ చర్యలు లేవని విమర్శించారు. పొలాలు, స్థలాలు ఆక్రమించుకోవడం, అక్రమ మద్యం, ఇసుక అమ్ముకోవడం తప్ప నియోజకవర్గానికి ఏమీ ప్రయోజనం లేదని తెలిపారు. టిడిపి నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించనని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమకాంత్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షులు బూదూరు మల్లికార్జున రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు అమర్‌నాథ్‌ రెడ్డి, నాయకులు కృష్ణమోహన్‌ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి కోట్రేష్‌ గౌడ్‌, బీసీ సీనియర్‌ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, తెలుగు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు భరధ్వాజ్‌ శెట్టి, రవితేజ శెట్టి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్‌, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్‌ సాబ్‌, అబ్దుల్‌, విజయరామిరెడ్డి, అశోక్‌ రెడ్డి, కురుగోడు, మారెప్ప, యోబు, బీసీ సాధికార సభ్యులు కురవ మల్లికార్జున, మీసేవ ఆంజనేయులు, బొగ్గుల నరసన్న, తిక్కస్వామి గౌడ్‌, చిలకలడోన హనుమంతు, బండ్రాల నరసింహులు, మాలపల్లి చంద్ర పాల్గొన్నారు.