ప్రకృతి వైపరీత్యాల ముందు
దళారుల చేతిలోను
గిట్టుబాటు ధరలోను
ఎప్పుడూ ఓడిపోతూ
సమాజానికి పట్టెడన్నం పెట్టే
రైతన్నా!
ఇప్పుడు గెలిచావు
ఈ గెలుపు నల్ల చట్టాలపై
ఒంటెత్తు పోకడలపై
ఎంత శ్రమపడ్డావు?
ఎందరు సహచరులను
కోల్పోయావు?
ఎండలేదు, వానలేదు,
చలిలేదు, దుమ్ములేదు
ఆంక్షల ముళ్ళకంచెలను
సైతం ఛేదించి దూకావు
బెదిరింపులకు బెదరలేదు
తుపాకీకి వెరవలేదు
నిర్దాక్షిణ్యంగా
కారెక్కించి చంపేసినా
వెనక్కి తగ్గలేదు.
నీ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది
ఉద్యమం వెనక బాధ అర్థమయ్యింది
అందుకే ప్రభుత్వం దిగొచ్చింది
తప్పు ఒప్పుకొని
క్షమాపణ కోరింది.
ఇకనైనా ప్రభుత్వాలు
ఒంటెత్తు పోకడలు మానుకోవాలి
నీ స్ఫూర్తి ప్రజావ్యతిరేక చర్యలను
ఎదురించేవారికి బాసట కావాలి
వేమూరి శ్రీనివాస్
99121 28967