May 03,2021 12:03

మనసులో అనిర్వచమైన చిన్న అలజడి
తీయని తలపుల మధురమైన తాకిడి
బహుశా నీ ఆగమనానికి సంకేతంలా !

అమ్యావాస్యనాడు వెన్నెల కాసినట్లు
ఊహలకు ఊసుల ఊపిరి అందినట్లు!
కలలకు రంగుల హంగులు అద్దినట్లు
ఆశల కొమ్మకు వసంతాలు పూచినట్లు!

దాగుడుమూతల ప్రేమలో ఎప్పుడూ ఇంతే
చిట్టి గుండెకు వలపుల తాడనాలు
లేకుంటే విరహపు తుఫానులు!

నువ్వు వస్తే మురిపిస్తూ ప్రాణం తీస్తావ్‌!
లేకుంటే విరహమిచ్చి ప్రాణం తీస్తావ్‌!
 

- ఉషారం
955387557