Mar 15,2023 23:32

విచారణ జరుపుతున్న అధికారులు

ప్రజాశక్తి -కారంచేడు : కారంచేడు గ్రామ పంచాయతీలో రూ.85 లక్షల నిధులు దుర్వినియోగంపై చీరాల డిఎల్‌పిఒ కె.శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టారు 2019- 2020, 2020- 2021 సంవత్సరాల కాలంలో పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలో కారంచేడు గ్రామపంచాయతీలో సుమారు రూ. 85 లక్షల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లు ప్రస్తుత సర్పంచి బాలిక శివపార్వతి గతంలో ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా మూడు సంవత్సరాల తర్వాత విచారణ చేపట్టారు. విచారణ అధికారులుగా చీరాల డిఎల్‌పిఒ కె.శ్రీనివాసరావు నూతలపాడు పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్‌, దేశాయిపేట జూనియర్‌ అసిస్టెంట్‌ కోటేశ్వరరావు,. నాగులపాలెం పంచాయతీ కార్యదర్శి పి.శ్రీనివాసరావు కడవకుదురు పంచాయతీ కార్యదర్శి ఎన్‌.సూర్యనారాయణ ఉన్నారు.