ప్రజాశక్తి-విజయవాడరూరల్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలవుతున్న వివిధ పథకాలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఎస్‌సిఇఆర్‌టి నేతృత్వంలో డిల్లీ బృందం విజయవాడరూరల్‌లోని నిడమానూరు హైస్కూల్‌ను మంగళవారం సందర్శించింది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, డిజిటల్ విద్య, అమ్మఒడి, మనబడి నాడు నేడు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, ఇతర అంశాలు పరిశీలించారు. విద్యతో పాటు కళలు, వ్యాయామ విద్యలో విద్యార్ధుల ప్రతిభను కూడా పరిశీలించారు. యోగ తదితర అంశాలలో ప్రదర్శించిన కార్యక్రమాలు ఆసక్తిగా తిలకించారు. డిల్లీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా వారు వివరించారు. అనంతరం సమగ్ర శిక్ష కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఎఎస్‌పిడి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫాకల్టీ ఎస్.సతీష్ సమన్వయం చేసారు. ఢిల్లీ టీంకి రాష్ట్ర పథకాల మీద ప్రదర్శనను హేమప్రసాద్ నిర్వహించగా సమగ్ర కార్యక్రమాలను సతీష్‌రెడ్డి నిర్వహించారు.










