కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజబాబు
ప్రజాశక్తి- తాళ్లరేవు
.నిబంధనలు సడలించి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలో పోలేకుర్రు, జార్జి పేట, చిన్న బాపనపల్లి, పెదబాపనపల్లి, లచ్చి పాలెం గ్రామాలలో వ్యవసాయ భూములు పరిశీలించారు. అకాల వర్షాల వల్ల మొలకెత్తిన ధాన్యాన్ని రైతులు జిల్లా కార్యదర్శి రాజబాబుకు చూపించారు. ప్రైవేటు వ్యాపారస్తులు బస్తా రూ.900కు ధాన్యం అడుగుతున్నారని, తక్కువ ధర కు ఇవ్వలేక పోతున్నామని తెలిపారు. ఎకరానికి రూ. 30 వేల చొప్పున 5 ఎకరాలకు లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టామని రైతు పంపన చందర్రావు తెలిపాడు. అనంతంర రాజబాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వారం రోజుల్లో అకౌంట్లో డబ్బులు జమ చేయాలని, వెంటనే మురుగు డ్రెయిన్లు బాగు చేయించి నీళ్లు దిగే ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట పంపన చందర్రావు, పంపన సత్యనారాయణ, కొండేపూడి వెంకన్న, కొండేపూడి సత్యనారాయణ, దొమ్మేటి జానకిరామ్, గుత్తుల శ్రీనివాస్, కొండేపూడి కష్ణమూర్తి ,కాజా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
లచ్చిపాలెం గ్రామంలో నీట మునిగి కుళ్లిపోతున్న వరి దుబ్బులను పరిశీలిస్తున్న రాజబాబు










