వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్న ట్రాఫిక్ సిఐ పార్థసారథి
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ పార్థసారథి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆపిన వాహనాల యజమానులకు, ఆయా దుకాణాల యజమానులకు, బ్యాంకుల మేనేజర్లకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకు ప్రాంతంలో రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడంపై ట్రాఫిక్ స్తంభిస్తుండడంపై బ్యాంకు మేనేజర్‌తో చర్చించారు. బ్యాంకు ముందు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని, వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని సూచించారు. అలాగే వాహనాల యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా వేశారు.










