Oct 30,2022 23:06

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -విఆర్‌ పురం : ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విఆర్‌పురం ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ సూచించారు. మండలంలోని రేఖపల్లి జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, మద్యం మత్తు, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, బైక్‌ల సౌండ్‌ పొల్యూషన్‌, అతివేగంగా వాహనాలు నడపడం వంటి నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడపడం నేరమన్నారు. వాహన రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పక్కాగా ఉండాలని , బైకిస్టులు విధిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనేసూక్తిని గుర్తెరిగి వాహనాలను నడిపి, సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని సూచించారు కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ రవి, విక్టర్‌, కానిస్టేబుల్స్‌ శ్రీను, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.