ప్రజాశక్తి - గోనెగండ్ల
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మిగనూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మహ్మద్ ఖాద్రీ, గోనెగండ్ల ఎఒ జి.హేమలత హెచ్చరించారు. గురువారం గోనెగండ్లలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను విక్రయించే ఇన్‌పుట్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డీలర్లందరూ విత్తన చట్టం ప్రకారం క్రయవిక్రయాలు జరపాలని తెలిపారు. గోడౌన్ల లైసెన్స్‌లను ఇంక్లూజన్ చేసుకోవాలని, వచ్చిన ప్రతి విత్తన లాటుకు ఇన్వాయిస్ నెంబర్ ఉండాలని సూచించారు. ఎంఆర్‌పి ధరల కంటే అధిక ధరలకు విత్తనాలను విక్రయించరాదని తెలిపారు. రోజూ ధరల పట్టిక స్టాక్ బోర్డును నమోదు చేయాలని చెప్పారు. కొన్న ప్రతి రైతుకూ తప్పనిసరిగా బిల్లు ఇవ్వడంతో పాటు బిల్లుపై రైతు సంతకం చేయించుకోవాలని తెలిపారు.
మాట్లాడుతున్న ఎఒ హేమలత










