Jul 26,2023 19:05

రికార్డులను పరిశీలిస్తున్న ఎఒ వరప్రసాద్‌

ప్రజాశక్తి - పెద్దకడబూరు
నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహించే దుకాణాలను మూసేస్తామని ఎఒ వరప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం మండలంలోని కల్లుకుంట గ్రామంలో వివిధ పురుగుమందు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కల్లుకుంట గ్రామంలో శ్రీహనుమాన్‌ ట్రేడర్స్‌, లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్‌, గురు దత్తాత్రేయ ఫర్టిలైజర్‌ తదితర షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని దుకాణ యజమానులను రిజిస్టర్లు క్రమం తప్పకుండా రాసుకోవాలని తెలిపారు. రైతులకు పురుగుమందులు అమ్మేటప్పుడు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.