Aug 10,2023 22:15

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తదితరులు

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలన, ఇంటింటి ఓటరు సర్వే కార్యక్రమం నిబంధనల మేరకు చేపడుతున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఇంటింటి ఓటరు సర్వేపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 5,87,151 డోర్‌ నంబర్లు కలవని వాటిలో 3,11,927 ఇళ్లను బూత్‌ లెవల్‌ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. 53 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. ఒకే డోర్‌ నంబరులో పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వివరాలు, వందేళ్లు దాటిన వారి వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, మండల అధికారులు బూత్‌ లెవల్‌ అధికారులతో నిత్యం మాట్లాడుతూ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.