
కళాశాల ముందు ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు
ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ నిబందనలను పాటింకుండా సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహిస్తు, విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న నారాయణ కళాశాలపై ఇంటర్ విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికి సెలవు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తుండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. విద్యాశాఖ అధికారులకు కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిహాల్, హర్ష కుమార్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.