Jan 03,2023 00:07

సీతామహాలక్ష్మిని సన్మానించిన జిల్లా అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి, ఉప కలెక్టర్‌ పని చేసిన నందూరి మహాలక్ష్మి నిబద్ధత గల అధికారి అని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అన్నారు. డిసెంబర్‌ 31న సీతామహాలక్ష్మి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం ఆమెను జిల్లా అధికారుల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమయపాలన, చట్టాల పట్ల అవగాహన ఉన్న అధికారి సీతామహాలక్ష్మి అని ప్రశంసించారు. కలెక్టర్లతో తలలో నాలుకల వ్యవహరించి ఎన్నో సమస్య లను పరిష్కరించారన్నారు. సన్మానగ్రహీత సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఏ శాఖలో పనిచేసినా సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో తన సర్వీసు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ హేమంత్‌, డ్వామా పిడి సందీప్‌, డిహెచ్‌ఓ ప్రభాకర్‌ రావు, జిఎం డిఐసి శ్రీధర్‌, డిపిఓ శిరీష రాణి, డిఎల్‌డిఓ మంజుల వాణి, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామారావు, కార్యదర్శి లక్ష్మణరావు పాల్గొన్నారు.