Apr 12,2023 23:56

కల్పనాకుమారిని సత్కరిస్తున్న కలెక్టర్‌, రెవెన్యూ ఉద్యోగులు

ప్రజాశక్తి-అనకాపల్లి
జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి తన విధులను ఎంతో నిబద్ధతతో చేశారని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అభినందించారు. ఇంతవరకు ఇక్కడ జేసీగా చేసిన కల్పనకుమారి బదిలీపై సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిగా వెళ్తున్న సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కల్పనా కుమారి అభినందన సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కష్టతరమైన పనులను కూడా సులభతరంగా అధికారులచే చేయించే నైపుణ్యం ఆమెలో ఉందన్నారు. జిల్లాలో రీ సర్వే పనులను అత్యంత వేగవంతంగా జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. జెసి కల్పనకుమారి మాట్లాడుతూ జాయింట్‌ కలెక్టర్‌గా అనకాపల్లి జిల్లాలో పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డిఆర్‌ఓ వెంకటరమణ, ఆర్డీవో చిన్ని కృష్ణ, ఎస్‌డిసి అనిత, డ్వామా పిడి సందీప్‌, ఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు, మాడుగుల తహశీల్దారు రత్నం, సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డిఓ జయరాం, సిపిఓ రామారావు, డిపిఓ శిరీష రాణి, మత్స్యశాఖ డిడి లక్ష్మణరావు, డీఈవో మహాలక్ష్మమ్మ, ఎస్డీసీలు రమామణి, జ్ఞాన వేణి, జిల్లా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.