ఘనంగా పాపులర్ షూ మార్టు 60వ వార్షికోత్సవ సంబరాలు
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
దార్శనికత కలిగిన వ్యాపార దిగ్గజం చుక్కపల్లి పిచ్చయ్య అని, ఆయన వ
ూర్గదర్శకంలో పాపులర్ షూ మార్టు 60 ఏళ్లుగా వినియోగదారులకు చక్కని ఉత్పత్తులను అందిస్తుందని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రయిలవేట్ లిమిటెడ్ మేనేజింగ్ ఢైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. పాపులర్ షూ మార్టు 60వ వార్షికోత్సవ సంబరాలు లబ్బీపేటలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో గురువారం సాయంత్రం జరిగాయి. ఈసందర్భంగా సంస్థ ప్రస్తానంలో నిబద్దతతో పనిచేసిన పలువురు సిబ్బంది, వ్యాపార భాగస్వామిలో సహకరించిన వారికి ఘన సత్కారం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న శైలజా కిరణ్ మాట్లాడుతూమ అంకితభావం, అలోచన, ముందుచూపు, వినియోగదారులకు సేవలను అందించడంతో పాటు మంచి ఉత్పత్తులను అందించడం కారణంగానే పాపులర్ షూ మార్టు 60 ఏళులగా వ్యాపారాభివృద్దితో ఎంతో మంది ఆదరణ పొందుతుందని తెలిపారు. వ్యాపారంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించి వినియోగదారుల మనన్నలు పొందడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు సంస్థ తరపున చేయడం వలన ఎంతో మంది హృదయాలలో పాపులర్ సంస్థ చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. సంస్థ వ్యవస్థాఫకులు చుక్కపల్లి పిచ్చయ్య ఫుట్‌వేర్ రంగంలోనే అగ్రగణ్యులుగా ఉన్నారని ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఈరంగంలో ముందుకు వచ్చారని తెలిపారు. శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు పద్మభూషన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా వ్యాపార సంస్థ 60 సంవత్సరాలు నిరాటకంగా కొనసాగడమంటే సామాన్య విషయం కాదన్నారు. చక్కటి ఆశయంతో, వినియోగదారులకు మంచి ఉత్పత్తులను అందించాలనే ఏకైక లక్ష్యంతో సంస్థ పనిచేసిందని అందుకే వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉందని రానున్న కాలంలో మరింత మంది ఆదరణ పొందుతుందని పేర్కొన్నారు. పాపులర్ సూ మార్టు మేనేజింగ్ పార్టనర్ చుక్కపల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పాపులర్ షూ మార్టును 1962లో విజయవాడ ప్రదాన కేంద్రంగా, తెనాలి, గుంటూరులో సింగిల్ షాపుతో ప్రారంభించినట్లు తెలిపారు. నేడు నాలుగు రాష్ట్రాలలో 156 శాఖలు ఉన్నాయన్నారు. వెయ్యి మందికిపైగా స్టాఫ్ పనిచేస్తున్నారని, 25 లక్షల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. సంస్థ లాభాలలో కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలను వినియోగించాలనే ఉద్దేశంతో పాపులర్ సూ మార్టు గ్రూపు సంస్థల తరపున ట్రస్టును ఏర్పాటుచేసి కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలను నిర్వహిం చినట్లు తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తే ఉద్యోగుల పిల్లల ఫీజులను కూడా తమ సంస్థ భరిస్తుందన్నారు. ఈఏడాది సుమారు 45 లక్షల రూపాయలు సంస్థ ఉద్యోగుల పిల్లలకు అందించినట్లు తెలిపారు.










