ప్రజశక్తి - చీరాల
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నాగరత్న హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సెంటర్ అండ్ మెటర్నిటీ సెంటర్ ఎండి డాక్టర్ యార్లగడ్డ అనిల్ చౌదరి, డాక్టర్ యార్లగడ్డ అంజలి వైద్య సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని శాంతి థియేటర్ రోడ్డులో అత్యాధునిక పరికరాలతో అన్నీ వసతులతో నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభించుకున్న సందర్భంగా ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలకు గుంటూరు, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. హాస్పిటల్ భవనంలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కట్ట చంద్ర, గుంటూరు మాధవరావు పాల్గొన్నారు.










