ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి నగరపంచాయతీ నూతన చైర్మన్‌గా గోపురపు రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌ను ఎన్నుకున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న చల్లా అంకులు ఇటీవల తమ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైస్‌చైర్మన్ బాపతు వెంకటరెడ్డి ఇన్‌ఛార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల అధికారిగా జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారిగా జాలిరెడ్డిని నియమించారు. రెండు రోజుల క్రితం ఆరవ వార్డు కౌన్సిలర్ గోపురపు రాజ్యలక్ష్మిని చైర్మన్‌గా నిర్ణయించారు. అందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో గోపురపు రాజ్యలక్ష్మిని చైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ మేకల సులోచన,17 వవార్డు కౌన్సిలర్ ఆముదాలపల్లి ప్రమీల బలపరిచారు. మిగతా కౌన్సిలర్లు రాజ్యలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్యే టిజెఆర్. సుధాకరబాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొని నూతన చైర్మన్ గోపురపు రాజ్యలక్ష్మిని అభినందించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చీమకుర్తి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడపాలని సూచించారు. చైర్మన్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టిజెఆర్. సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా అంకులు,వైస్ చైర్మన్లు బాపతు వెంకటరెడ్డి, మాణిక్యం, జడ్‌పిటిసి వేమా శ్రీనివాసరావు, లయన్స్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.జవహర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు చలువాది బదరీ నారాయణ, వైసిపి పట్టణ అధ్యక్షుడు కె.శేఖరరెడ్డి, కౌన్సిలర్లు తప్పెట బాబూరావు, భీమన వెంకటరావు, ఎస్‌కె. యస్‌దాని, ఎస్‌కె.బాషా, గోపురపు చంద్ర, సుందరరామిరెడ్డి, జి. గంగయ్య, ఎ.ప్రమీల, మంచా హరికృష్ణ, మస్తాన్‌రెడ్డి, జి.ఓబులరెడ్డి, పత్తి కోటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ ఎస్‌కె.ఫజులుల్లా తదితరులు పాల్గొన్నారు.