Aug 25,2023 21:42

షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న సినీ నటి పూజా హెగ్డే

కడప అర్బన్‌ : సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 32వ బ్రాంచ్‌ కడప నగరంలోని ప్రారంభించేందుకు ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే శుక్రవారం కడపకు విచ్చేశారు. ప్రారంభోత్సవ సందర్భంగా పూజా హెగ్డే సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ కడపలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్‌ సురేష్‌ సీర్ణ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యాధునిక నాణ్య మైన వస్త్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలకు నచ్చే విధంగా అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లెహంగాస్‌, చుడిదార్స్‌, లెగ్గిన్స్‌, జేగ్గిన్స్‌, కిడ్స్‌ వేర్‌, మెన్స్‌ వేర్‌ ఏర్పాటు మహిళలకు అన్ని శుభకార్యాలలకు అవస రమయ్యే పోచంపల్లి, మంగళగిరి, కంచి ధర్మవరం ఉప్పాడ సొంతమగ్గలపై తయారు చేసిన పట్టు చీరల కలెక్షన్‌ ఒక సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ కే సొంతం అన్నారు. జిల్లా ప్రజలు ఒకసారి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సందర్శించి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్లు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు.