
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తూ నిర్మించిన కీడాకోలా చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా బందర్ రోడ్‌లోని ఒక హోటల్‌లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ క్రైమ్ కామెడీ జోనర్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు తెలిపారు. ఒక బాటిల్ చుట్టూ జరిగే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపారు. బాటిల్‌కు బొద్దింకకు ఈ కథతో సంబంధం ఏంటి అనేది సస్పెన్స్‌గా ఈ చిత్రం కొనసాగుతుందని తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తూ సినిమాకి హైలెట్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా పలువురు కొత్త నటీనటులను వెండితెరకి పరిచయం చేస్తున్నామన్నారు. పెళ్లిచూపులు చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించాలని అలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం నటులు జీవన్, చైతన్య మాట్లాడుతూ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవాలని ఉద్దేశంతోనే కీడాకోలా చిత్రాన్ని నిర్మించాలని చెప్పారు. నవంబర్ 3న చిత్రం రిలీజ్ కాదని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. సినిమాను థియేటర్‌లోనే ప్రేక్షకులు చూడాలని సూచించారు. విలేకరుల సమావేశంలో నిర్మాత సాయి కష్ణ, నటులు రాగ్ మయూరి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.