అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న డిఐజి అమ్మిరెడ్డి, ఎస్సీ అన్బురాజన్
ప్రజాశక్తి -అనంతపురం క్రైం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పోలీసులు నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ నేతత్వంలో చేపట్టిన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమై వై.జంక్షన్, సప్తగిరి, రాజీవ్ సర్కిళ్ల మీదుగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ సప్తగిరి సర్కిల్ లోని పోలీసు అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. అనంతరం క్లాక్‌టవర్ వద్ద మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డీఐజీ, ఎస్పీ అమరవీరుల త్యాగాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డీఎస్పీలు సీఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.










