ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ఇటీవల రిలీజ్ అయిన బ్రో మూవీ చిత్రం విజయోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని ఒక హోటల్లో తమ విజయోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ....తన మామయ్య పవన్ కళ్యాణ్ పక్కన నటించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రో చిత్రం కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఆత్రుతగా ఫీలయ్యానని... చిత్రంలో తన క్యారెక్టర్‌లో చనిపోయినప్పుడు నిజంగానే చనిపోయానా అని మూడు గంటల పాటు ఏడ్చానని తెలిపారు. ఎప్పుడు ఎప్పుడు చిరంజీవితో నటించే అవకాశం వస్తుందాని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాననీ చెప్పారు. మల్టీస్టార్ చిత్రాలలో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాననీ... మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాననీ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒక షార్ట్ ఫిలిం చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15న ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయనున్నామనీ తెలిపారు. అనంతరం ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ సమాధానం ఇస్తూ.....అంబటి రాంబాబు మీద జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదనీ... సినిమాని సినిమాగానే చూడండనీ...సినిమాలకు రాజకీయాలకు ముడి పెట్టవద్దనీ కోరారు. తనకు రాజకీయ అనుభవం లేదన్నారు. తదనంతరం దర్శకుడు సముద్ర ఖని మాట్లాడుతూ....తనకు యాక్టింగ్ కన్నా దర్శకుడిగా రాణించడమే చాలా ఇష్టమని...తను పదహారేళ్లగా డైరెక్షన్ చేస్తున్నాననీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో అందరూ సినిమాలు తీయాలనుకుంటారు.. కానీ తనకు టైం వచ్చింది కాబట్టి తీశాననీ అన్నారు...పవన్ కళ్యాణ్‌తో పది నిమిషాలు మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం అర్థమయిందన్నారు. ఈ చిత్రం తీసేందుకు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం కోలుకొని త్వరగా రావాలని రెండు సంవత్సరాలు ఎదురు చూశాననీ ఆయన పేర్కొన్నారు... ఈ సమావేశంలో దర్శకుడు, కథానాయకుడుతో పాటు సహనటుడు అరుణ్, డిస్ట్రిబ్యూటర్ కుమార్ పవన్ కూడా పాల్గొన్నారు.










