Aug 26,2023 21:10

పార్కును ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం, కమలాపురం ఎమ్మెల్యే

కడప అర్బన్‌ : ఎన్నడూ లేని విధంగా కడప నగరంలో అభివృద్ధి పనులు చేపట్టా మని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి అంజా ద్‌బాషా పేర్కొ న్నారు. శనివారం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సాధారణ నిధుల నుంచి స్థానిక అక్కా యపల్లె పరిధిలో పార్కు, ఐటిఐ సర్కిల్‌ వద్ద గాంధీ పార్కు, బాలాజీ నగర్‌ లోని హిందూ శ్మశాన వాటికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెమ్ముమియా పేట ప్రాం తంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో పార్కును ప్రారంభోత్సవం చేశామని పేర్కొన్నారు. నగరంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి పార్కు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్యెల్యే పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌ బేగం, వైసిపి సీనియర్‌ నాయకులు అఫ్జల్‌ ఖాన్‌, స్థానిక కార్పొరేటర్లు వి.హేమలత, వి రామకష్ణారెడ్డి, షేక్‌ మొహమ్మద్‌ షఫీ,పాక సురేష్‌ బండి ప్రసాద్‌, సూర్యనారాయణ, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి , తోట కష్ణ, జమాల్‌ బాషా, సిహెచ్‌ సునీల్‌ కుమార్‌, మున్సిపల్‌ ఎస్‌ ఈ రత్నాల రాజు, ఎఇ దిల్షాద్‌ పాల్గొన్నారు.