
నగరి ప్రజలకు రుణపడి ఉంటా..
జన్మదిన వేడుకల్లో మంత్రి రోజా
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నగరి నియోజకవర్గంలో నా కోసం అనుక్షణం కషి చేస్తున్న నా వాళ్లకి నా 'ఊపిరి ఉన్నంత వరకు నగరి ప్రజలకు రుణపడి ఉంటా' అని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. పుత్తూరు మండలం వేపగుంట సమీపంలోని కల్యాణ మండపంలో శుక్రవారం జన్మదిన వేడుకల్లో మంత్రి రోజా ప్రసంగించారు. అశేష అభిమానులు, వైసిపి కుటుంబ సభ్యుల హర్షద్వానాల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు సహకరించిన వాళ్లు, తాను బాగుండాలని ఆశీర్వదిస్తున్న వాళ్లు కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. తనను ఎప్పుడూ వెన్నంటి ప్రోత్సహించే భర్త సెల్వమణి సహక రించిన నా పిల్లలు, తనను గెలిపించిన నగరి ప్రజలకు కృత జ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ 175 కి 175 స్థానాలు సాధించి రాష్ట్రాన్ని అభివద్ధివైపు, నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మొదటి సినిమాలో పాట పాడిన ప్రముఖ గాయకులు మనోతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ జన్మదిన వేడుకలలో మంత్రి అంబటి రాంబాబు, టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి, తమిళనాడు నాయకులు దిండిగల్ లియోని ప్రసంగించారు. వైసిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాంస్కతిక, నత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఏ హరి, నగరి ఛైర్మన్ నీలిమేఘం, వైస్ ఛైర్మన్లు డి శంకర్, డి జయ ప్రకాష్, ఎంపీపీలు మునివేలమ్మ, వనమాల పేట ఎంపీపీ విజయలక్ష్మి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.