Oct 10,2023 22:47

ప్రాక్టీస్‌ చేస్తున్న క్రికెట్లు జట్లు


ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మంగళగిరి, మూలపాడులోని క్రికెట్‌ స్టేడియంలలో బీసీసీఐ అండర్‌ 19 పురుషుల అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ టోర్నీ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం ఢిల్లీ, మహారాష్ట్ర జట్లు మంగళగిరి స్టేడియంకు చేరుకున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన జట్ల కెప్టెన్లు ఆర్‌. వఘెలా, కిరణ్‌ కార్మెల్‌, చీఫ్‌ కోచ్‌ లు జస్వంత్‌ రారు, అజరు చవాన్‌ పర్యవేక్షణ లో మంగళగిరి స్టేడియంలో ప్రాక్టీస్‌ ముమ్మరంగా నిర్వహించారు. హైదరాబాద్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, బెంగాల్‌ రాష్టాలకు చెందిన జట్లు మూలపాడులోని స్డేడియంలో ప్రాక్టీస్‌ చేశారు.