Jun 10,2023 20:47

రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గనకు స్వాగతం పలుకుతున్న యాజమాన్య

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌
నగరానికే తలమానికం బత్తుల బిల్లర్స్‌ లేక్‌ ఫ్రంట్‌ అని మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో నగరవనం ఎంట్రెన్స్‌ వద్ద బత్తుల బిల్డర్స్‌ వారి బత్తుల లేక్‌ ఫ్రంట్‌ మోడల్‌ విల్లాస్‌ను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, తోగురు ఆర్థర్‌, కర్నూలు నగర మేయర్‌ బివై.రామయ్య, కుడా ఛైర్మన్‌ హర్షవర్ధన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడారు. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన మోడల్‌ విల్లాస్‌లు కర్నూలు నగరంలో ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం బత్తుల బిల్డర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాగార్జున రెడ్డి మాట్లాడారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ రహదారిని అనుకుని, కర్నూలు నగరానికి అతి సమీపంలో బత్తుల లేక్‌ ఫ్రంట్‌ మోడల్‌ విల్లాస్‌ను ప్రారంభించామని తెలిపారు. బత్తుల లేక్‌ ఫ్రంట్‌ 20 ఎకరాల గేటెడ్‌ కమ్యూనిటీతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 228 స్మార్ట్‌ విల్లాలు, ఇంటీరియర్‌, 50 వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌, 50 పైగా సౌకర్యాలతో, 4 ఎకరాల గ్రీన్‌ స్పేస్‌ కలదని తెలిపారు. వీటితో పాటు బ్రోచర్‌లో చూపించిన విధంగా ప్రతి సౌకర్యాన్ని ఖచ్చితంగా సమకూరుస్తానని పేర్కొన్నారు. బిల్డింగ్‌ని వందకి వంద శాతం మోడల్‌ చూపించిన విధంగానే కడతామని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్‌ ఉండదని, తనకు వచ్చే మార్జిన్లో కాంప్రమైజ్‌ ఉంటుది తప్ప ప్రొడక్ట్‌లో ఎలాంటి కాంప్రమైజ్‌ ఉండదని తెలిపారు. ఈ ప్రాజెక్టుని ఏపిలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ బిల్డర్‌గా ఎదగడానికి ఈ ప్రాజెక్టు తనకి మొదటి స్టెప్‌ అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని, 1.5 కి.మీ ఇంటర్నల్‌ జాగింగ్‌ ట్రాక్‌ ఇస్తున్నానని, నెక్స్ట్‌ జనరేషన్‌ పిల్లలకు స్విమ్మింగ్‌ తెలిసి ఉండాలని, డ్యాన్సింగ్‌ తెలిసి ఉండాలని, నేర్చుకోవడానికి ఔట్‌ డోర్‌ ఆక్టివిటీస్‌ ఇస్తున్నామని తెలిపారు. సేఫ్టీ విషయానికి వస్తే కేవలం రిజిస్ట్రేషన్‌ వెహికల్స్‌ తప్ప మిగతా ఎటువంటి వెహికల్‌కి లోపలికి అనుమతి లేదని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికి మీ ఇంట్లో వాడిలాగా క్వాలిటీలో శ్రద్ధ చూపుతూ ప్రతి ఇంటిని కడతానని తెలిపారు. బత్తుల లేక్‌ ఫ్రంట్‌ మోడల్‌ విల్లాస్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.