ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరాభివద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి ఆనుకొని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌పై అంతస్తులో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కోలగట్లను కార్పొరేషన్ కాంట్రాక్టర్ల సంఘం ఘనంగా సత్కరించింది. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం స్వామి మాట్లాడుతూ అందరిసమన్వయంతోనే సాధ్యమవు తుందని అన్నారు. ఇదే ఒరవడితో మరింత ఉత్సాహంగా అభివద్ధి పనులు పూర్తిచేసి నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే క్రమంలో కాంట్రాక్టర్ల పాత్ర కీలకమని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పొరుగునున్న విశాఖపట్నంకు ధీటుగా మన నగరం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కమిషనర్ రాములునాయుడు మాట్లాడుతూ ఇంజినీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, ఇఇ కె.శ్రీనివాసరావు, కార్పొరేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బండారు బంగార్రాజు, విశాఖపట్నం అసోసియేషన్‌అధ్యక్షుడు చంద్రమౌళి, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
బిటి రోడ్డు ప్రారంభం
నగరంలోని దాసన్నపేట కాళీమాత ఆలయం జంక్షన్ వద్ద రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డును డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజావసరాలకు అనుగుణంగా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సమకూర్చుతున్నారన్నారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి కోలగట్ల కృష్ణారావు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ సంఘం రెడ్డి బంగారు నాయుడు, బొద్దాన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.










