నగర సమస్యలపై అవగాహన సదస్సు
ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్: స్మార్ట్‌సిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో నగర అభివద్ధిపై అవగాహన సదస్సు జరిగింది. ఇందులో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సొసైటీలో ఉన్న అనేక అసోసియేషన్లతో పాటు, బయట ఉన్న అసోసియేషన్లను కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి నగర ప్రధాన సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు. తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో సింహద్వారంలో ఉన్న చిత్తూరు నగరం నూరు సంవత్సరాల చరిత్ర కలదని, తమిళులు, తెలుగువారు కలగలిపి జీవిస్తున్న అతి పురాతన చరిత్ర కలిగిన ఈ నగరమని అన్నారు. అయిన్పటికీ అభివద్ధికి ఆమడ దూరంలో ఉందని అనేక సంవత్సరాలుగా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురై, బలై ఈ నగరం అల్లాడుతోందన్నారు. కావున జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమస్యలపై సమరభేరి మోగించాలనుకున్నామని తెలిపారు. తమ వినతిని కలెక్టర్, ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు తాండవ మూర్తి, కార్యదర్శి శివకుమార్, సత్య మహిళా జాతీయ కార్యదర్శి శోభారాణి, జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి, సభ్యులు అజ్మతుల్లా, కేశవరెడ్డి, కుమరేషన్, శ్రీదేవి పాల్గొన్నారు.










