ప్రజాశక్తి - గొల్లప్రోలు మున్సిపల్, నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ వర్కర్లు నిరసన తెలిపారు. మహిళా కార్మికులు విధులు బహిష్కరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. శుక్రవారం పురుషు కార్మికులు నిరసనలో పాల్గొంటారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఒ.నందీశ్వర రావు హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలాపు ఏసమ్మ, బి.సత్యవతి, దివ్యవాణి, పోలమ్మ, ఎం.లక్ష్మి, రాములమ్మ, బంగారు లావమ్మ, సిహెచ్‌వి.రమణ పాల్గొన్నారు.










