Feb 24,2023 23:11

ప్రజాశక్తి - చింతలపూడి
                చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ సూచించారు. చింతలపూడి పట్టణంలో పారిశుధ్య పరిస్థితులను ఆయన శుక్రవారం పరిశీలించారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పట్టణంలో ఉన్న చెరువును బాగుచేయించాలని పాతబస్టాండ్‌ బస్‌ స్టేషన్‌ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ కమిషనర్‌ ఎన్‌.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.