Sep 20,2023 20:42

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ మనోహర్‌

 బి.కొత్తకోట : స్థానిక నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అభివద్ధి కార్యక్రమాలపై కమిషనర్‌ పి.ఆర్‌.మనోహర్‌ నగర పంచాయతీ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైసిపి పలమనేరు నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎంపిపి పాగొండ ఖలీల్‌అహ్మద్‌ సూచనలు, సలహాలతో నగర పంచాయతీ అభివద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఖలీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజలకు నీరు రెండు గంటలసేపు వదిలేవిధంగా చర్యలు తీసుకో వాలన్నారు.నాలుగు రోజులకు ఒకసారి నాలుగు గంటల సేపు నీరు వదిలే దానికంటే ప్రతిరోజు రెండు గంటలసేపు వదిలేందుకు కషి చేయా లన్నారు. చాలా వరకు నీటి కొళాయిలకు ట్యాపులు లేవని, నీరు చాలా వధా అయి పోతుందని, వెంటనే ట్యాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధిదీ పాలు ఏర్పాటు చేసి, డ్రైయినేజీని ఎప్పటికప్పుడు శుభ్రపర చాలన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నగర పంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కషి చేయాలని సూచించారు. నగర పంచాయతీ అభివద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఎంతో కషి చేస్తున్నారని, భవిష్యత్తులో సహాయ సహకారాలతో మరింత అభివద్ధి చేసుకుం దామని కమిషనర్‌కు తెలిపారు. సమావేశంలో మండల వైసిపి కన్వీనర్‌ ప్రదీప్‌రెడ్డి, మండల జెసిఎస్‌ సచి వాలయ కన్వీనర్‌రెడ్డి హరి, వైసిపి నాయకులు భీమగాని ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ బాషా, సచివాలయ కన్వీనర్లు సి.ఆర్‌.చిన్నికష్ణ, జి.చాంద్‌బాషా, జీవి రామకష్ణ, నక్క సంతోష్‌, వైసిపి నాయకులు అభిలాష్‌రెడ్డి, సాయి, సద్దాం, రాయలసీమ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.