Jun 20,2023 00:38

ఆరోగ్య మిత్రలకు ప్రశంసా పత్రాలను అందిస్తున్న కలెక్టర్‌, జెసి తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సోమావారం కలెక్టరేట్‌లో ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్‌ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 106 ఫిర్యాదులను కమిటి సభ్యులు విచారించి పరిష్కరించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందిచేలా ఆసుపత్రి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు. సమావేశంలో నూతనంగా నియమితులైన ఆరుగురు ఆరోగ్యమిత్రలకు నియామక పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఇద్దరు ఆరోగ్యమిత్రాలకు (సయ్యద్‌ అజిజ్‌, పోలిశెట్టి శ్రీనివాసరావు)కు ప్రశంసా పత్రంతోపాటు రూ.5 వేలు నగదు బహుమతి అందజేశారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ శ్రావణ్‌బాబు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హనుమంతరావు, రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌, సెక్రటరీ రామచంద్ర రాజు, గుంటూరు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.జయరామకృష్ణ, పల్నాడు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.సునీల పాల్గొన్నారు.
మిషన్‌ శక్తి స్కీమ్‌ అమలుకు కమిటీ...
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని దిశ/సఖి(వన్‌స్టాప్‌ సెంటర్‌)కు మిషన్‌ శక్తి స్కీమ్‌ అమలుకు నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులుంటారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి, సాధికారిత అధికారి మెంబర్‌ కన్వీనర్‌గా, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట శివరామిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు మోవిడి వాణి, సాయిశ్రీ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలకు కృషి చేయాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలతో పాటు అవసరం మేరకు వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖపై మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హెచ్‌బీఎస్‌ఏజీ పరీక్షలు నూరు శాతం మంగళవారం నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని, లక్ష్యాలను అధిగమించని వారిపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణబాబును ఆదేశించారు. సమావేశంలో జిల్లా విధ్యాశాక అధికారిణి శైలజ, సమగ్ర శిక్ష ఏపీడీ విజయలక్ష్మీ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ జయరామకృష్ణ పాల్గొన్నారు
కుష్టు నివారణకు 26 నుంచి క్యాంపిన్‌..
జిల్లాలో కుష్టును పూర్తిగా నిర్మూలించేందుకు జూన్‌ 26 నుండి జూలై 16వ తేదీ వరకు లెప్రసి కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెన్‌ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలక్టరేట్‌ లో కలెక్టర్‌ అధ్యక్షతన లెప్రసి కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెన్‌ జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా లెప్రసి ఆఫీసర్‌ జి. సుబ్బారావు మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే సూక్ష్మ క్రిమి వల్ల వస్తుందని, ఇది ఎవరికైనా సోకవచ్చునని తెలిపారు. కుష్టు వ్యాధి చికిత్సకు శక్తివంతమైన ఔషధాలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా లభిస్తాయన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ జి.రాజ కుమారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖర రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.వెంకట శివరామిరెడ్డి , డిప్యూటీ కలెక్టర్లు మోవిడి వాణి, సాయిశ్రీ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణ్‌బాబు పాల్గొన్నారు.