Sep 04,2023 22:07

పల్నాడు జిల్లా: భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి అన్నారు. కలెక్టరేట్‌ లోని డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ స్పందన హాలులో చేనేత రంగానికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ వివరించారు. జిల్లా వ్యాప్తంగా చేనేత రంగంలో కొనసాగుతున్న చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు జిల్లా కలెక్టర్‌ సమావేశంలో వివరించారు. జిల్లాలో 3 ప్రత్యేక చేనేత క్లస్టర్‌లను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం, పెన్షన్లు, వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. చేనేతలను ప్రోత్సహించేందుకు జిల్లాలో ప్రతినెల మొదటి సోమవారం జిల్లా అధికారులంతా చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరు కావాలన్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు మేరకు జిల్లా అధికారులంతా చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరయ్యారు.