Sep 12,2023 21:42

ట్రాక్‌ పరిశీలించిన డిఆర్‌ఎం సౌరవ్‌ ప్రసాద్‌, అధికారులు

ప్రజాశక్తి - సాలూరు : నెలాఖరులోగా పట్టణానికి రైలు బండి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంగళవారం విశాఖ డిఆర్‌ఎం సౌరవ్‌ ప్రసాద్‌ ఇతర రైల్వే అధికారులతో కలిసి రైల్వే ట్రాక్‌, స్టేషన్లను పరిశీలించారు. కొద్దిరోజుల్లో విజయనగరం, విశాఖపట్నం మధ్య నడుస్తున్న పాసింజర్‌ రైలు బండిని సాలూరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డిఆర్‌ఎం సౌరవ్‌ ప్రసాద్‌ రైలు బండి నడపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ట్రాక్‌ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం సాలూరు రైలు స్టేషన్‌ను పరిశీలించారు. రైలు బండి ప్రారంభించే లోగా స్టేషన్‌ ఆధునీకరణ పనులు చేపట్టాలని కింద స్థాయి అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీనియర్‌ డిసిఎం అఖిలేష్‌ త్రిపాఠి, సీనియర్‌ డిఒఎం సునీల్‌ కుమార్‌, సీనియర్‌ డిఇ ఎన్‌.అరుణ్‌ మరానా, సీనియర్‌ డిఎన్‌ సంజరు మీనా, సీనియర్‌ డిఇ ఆపరేషన్‌ శివప్రసాద్‌, డిఇ ట్రాఫిక్‌ బివి రమణ, ఎడిఎన్‌ ఎస్‌.కె.దీక్షిత్‌ ఉన్నారు.