Dec 19,2022 00:00

ఆందోళనలో పాల్గొన్న నేవీ నిర్వాసితులు

ప్రజాశక్తి- రాంబిల్లి
తమ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరించాలని ఎన్‌ఎఒబి నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. నేవీ మెయిన్‌ గేట్‌ ముందు ఎనిమిది గ్రామాల నేవీ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన ఆదివారం నాటికి 48వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిర్వాసిత జెఎసి నాయకులు మాట్లాడుతూ భూములు, చేపలు వేట సాగించే శారద, వరాహ నదులు తీసుకొని తమకు జీవించడానికి మార్గం చూపించకపోవడం బాధాకరమన్నారు. ఒకపక్క నేవీ గేట్లు బంధించి, మరో వైపు జెట్టీ కట్టకపోతే నిర్వాసిత మత్స్యకారులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్వాసితుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు.