Jan 04,2023 00:09

ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఒబి నిర్వాసితులు

ప్రజాశక్తి-రాంబిల్లి
నేవల్‌ బేస్‌ నిర్వాసితుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం తగదని నేవీ నిర్వాసిత జెఎసి నాయకులు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎఒబి నిర్వాసిత ఎనిమిది గ్రామాల నిర్వాసితులు మండలంలోని వాడనర్సాపురం సమీపంలో నేవీ గేటు ముందు చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 65వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 65 రోజులుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 65 రోజుల నుంచి చేపల వేట లేక మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి జెట్టీ నిర్మాణం చేయాలని, అంత వరకు ఆధార్‌ కార్డు ఆధారంగా నేవీ గేట్‌ గుండా చేపల వేటకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాల నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.