Aug 25,2023 22:09

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

* దాతలు ముందుకు రావాలి
* జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
కార్నియల్‌ అంధులకు నేత్రదానంతోనే కంటిచూపు స్యాధ్యమవుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా తన ఛాంబరులో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి సెప్టెంబరు ఎనిమిదో తేదీ వరకు జిల్లాలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అపోహలు వీడేందుకు నేత్రదానం ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. కార్నియల్‌ అంధుల్లో చూపును నేత్రదాతల నుంచి సేకరించిన కార్నియా మార్పిడి ద్వారా మాత్రమే చూపు వస్తుందన్నారు. వీరికి వేరొక ప్రత్యామ్నాయం లేదని, అందువల్ల ప్రజలందరూ నేత్రదానంపై అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా తమ కుటుంబంలో మరణిస్తే నేత్రదానానికి అంగీకరింపజేయించి సమాచారాన్ని నేత్ర సేకరణ కేంద్రానికి తెలియజేస్తే అంధుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని చెప్పారు. జిల్లాలో పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అధికారుల ద్వారా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో నేత్రదానంపై విస్తృతంగా అవగాహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.