May 26,2023 23:53

నేత్ర సరరక్షణపై అవగాహన కల్పిస్తున్న మురళీమోహన్‌

ప్రజాశక్తి- విశాఖపట్నం : మరణానంతరం ఈ లోకాన్ని మళ్లీ చూడగలగడం, మరొకరికి కంటిచూపునివ్వడం నేత్రదానంతోనే సాధ్యమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విశాఖ శాఖ కోశాధికారి డాక్టర్‌ ఎంవివి.మురళీమోహన్‌ అన్నారు. శుక్రవారం పెద జాలరిపేటలో నేత్ర దానం, నేత్ర సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటిచూపు కాపాడుకోవడానికి ఆకు కూరలు, గుడ్లు, పాలు, క్యారెట్‌, బొప్పాయి వంటి ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదన్నారు.
అలాగే కంటిచూపును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలన్నారు. ఒక కన్ను తెరిచి, మరో కన్ను మూసి ఉంచి దృష్టిని పరీక్షించుకోవాలని సూచించారు. తద్వారాతెలిపారు. ఏ కంటి చూపులో సమస్య ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా నేత్ర వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చన్నారు. నిద్ర నుంచి లేచిన వెంటనే సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలని సూచించారు. 45ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో ఎవరికైనా గ్లకోమాచరిత్ర ఉన్నవారు ఆరునెలలకోసారి విధిగా కంటిపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరణించిన తర్వాత కనీసం నలుగురికి చూపు ఇవ్వగల నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. ఆవో గావ్‌చాలో భాగంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన అవగాహనలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ బృందం పాల్గొంది.