కడప అర్బన్ : చేనేత కుటుంబాల ఆర్థిక అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ విసి హాలులో చేనేత, జౌళి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, జాతీయ చేనేత ఐక్య వేదిక కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ ఛైర్మన్ రాగా నరసింహులు, జిల్లా ఆప్కో డిఎంఒ వి.వరప్రసాద్, ఆప్కో డైరెక్టర్ ఉదయగిరి వెంకటేష్ హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మగ్గాలనే నమ్ము కొని జీవనోపాధి పొందుతున్న నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం' ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. చేనేత వత్తిని ప్రోత్సహించడానికి వివిధ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తుం దన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించ డానికే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో ప్రవేశ పెట్టి నేతన్నలు తయారు చేసిన వస్త్రా లను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి విక్రయి స్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా కార్మికులకు రాయితీలు ఇస్తుందని వివరించారు
ఆకట్టుకున్న ఆప్కో చేనేతల స్టాల్
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విసి హాలులో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు ఉత్పత్తి చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉన్న పలురకాల సంప్రదాయ నూలు, పట్టు వస్త్రాలు ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అభినందించారు.
చేనేత సంఘాల ర్యాలీ
అంతకు ముందు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి వన్ టౌన్ గాంధీ బొమ్మ వరకు చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు.. సంప్రదాయ చేనేత వత్తిని ప్రోత్సహిస్తూ ఆ రంగాన్ని బలోపేతం చేయాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళు శాఖ సహాయ సంచాలకులు వి.హరికష్ణ, డివో కష్ణ, ఏడివోలు శేషగిరి, అహ్మద్ రవి ప్రకాష్ రెడ్డి, సబార్డినేటర్స్ జయరాం, బాలకష్ణ, తొగత వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యనారాయణ, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా నరసింహా రావు, ప్రధాన కార్యదర్శి సుంకర రామచంద్రుడు, కోశాధికారి టేకూరి సుదర్శన్, గౌరవ అధ్యక్షులు ఉమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, వెలిగండ్ల సుబ్బరాయుడు, బొలిశెట్టి వెంకటస్వామి, జిల్లా చేనేత జౌలు శాఖ, ఆప్కో సిబ్బంది, కాంచన. శివప్రసాద్, పి, ప్రసాద్ పాల్గొన్నారు.










