Sep 08,2023 21:31

విజయ సంకల్ప యాత్ర కరపత్రాలను విడుదల చేస్తున్న జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, నాయకులు

ధర్మవరం టౌన్‌ : వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికే జనసేనపార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్పయాత్రను శనివారం ముదిగుబ్బ మండలం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను, భూదందాలు, దౌర్జన్యాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయడానికి విజయసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో రాయలసీమలో వారాహి యాత్ర ఉంటుందని, ఈ యాత్ర వచ్చేలోపు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విదానాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. నియోజకవర్గంలో జగన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డిపై పోరాటం చేస్తున్నామన్నారు. పట్టణంలోపార్థసారధినగర్‌ లో ఎమ్మెల్యేను రోడ్డువేయమన్నందుకు సాలమ్మకు పింఛను తొలగించారని దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు సాలమ్మకు శుక్రవారం పింఛన్‌ అందజేశారని, ఇది జనసేన పార్టీ విజయం అని అన్నారు.