Sep 29,2023 23:28

ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. వివరాలుఇవి..
అమలాపురం ఈనెల 30న శనివారం నుంచి నెలరో జులపాటు నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య వంతమైన జీవనాన్ని గడపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్ర వారం సిఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరె న్స్‌ అనంతరం అధికారులను ఉద్దే శించి జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శ కాలు అనుగుణంగా ఈ నెల రోజులు పాటు ఐదు దశలలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సిహె చ్‌.సత్తిబాబు, డిసిహెచ్‌ఎస్‌ పద్మశ్రీ రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు(పి.గన్నవరం)ప్రజారోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు అన్నారు.పి.గన్నవరం కమ్యూనిటీ టెన్త్‌ సెంటర్‌ సమీపంలో, అంబాజీపేట మార్కెట్‌ యార్డ్లో శుక్రవారం ఆరోగ్య సురక్ష పై సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌ఎ కోరారు. కార్యక్రమంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారు నాయుడు, మండల అధ్యక్షుడు కార్యదర్శులు నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చిన్నబాబు, వైస్‌ ఎంపిపి నేతలు నాగరాజు, పితాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై ఎంపిపి తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన ఎంపిడిఒ కె.జాన్‌ లింకన్‌, తహశీల్దార్‌ ఐపి.శెట్టి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 30న జొన్నాడ సచివాలయం వన్‌ తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు అక్టోబర్‌ 30 వరకు నెలరోజుల పాటు ఆయా సచివాలయాల పరిధిలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌, సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, ఎఎంసి ఛైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు తదితరుల పాల్గొన్నారు. ఆత్రేయపురం నేటి నుంచి నిర్వహించబోయే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కార్యదర్శులు అంతా సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు కార్యదర్శులకు సూచించారు శుక్రవారం ఆయన మండల ప్రజా కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు మామిడికుదురు ఈ నెల 30 నుండి వచ్చే నెల 27 వరకు లూటుకుర్రు, నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించబడునని మండల ప్రజా పరిషత్‌ పరిపాలనాధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. నగరం పిహెచ్‌సి పరిధిలో వచ్చే నెల 3 న పెదపట్నంలంక-1, 4 న ఈదరాడ, 5న బి.దొడ్డవరం, 7న అప్పనపల్లి-2, 10న మామిడికుదురు-1, 12న పెదపట్నంలంక-2, 18న అప్పనపల్లి-1, 20 న మామిడికుదురు-2 ,24 న మొగలికుదురు, 26 న నగరం-2లు, 27 న లూటుకుర్రు పిహెచ్‌సి పరిధిలో 30న కొమరాడ, 6న కరవాక, 9న లూటుకుర్రు, 11న గెద్దాడ, 13న పాశర్లపూడి-2, 17 న మగటపల్లి, 19 న గోగన్నమఠం, 21న పాశర్లపూడి1, 25న పాశర్లపూడి-2ల్లో నిర్వహించే ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఉప్పలగుప్తం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయని సర్పంచ్‌ సలాది ఊర్మిళదేవి అన్నారు. విలసవిల్లిలో శుక్రవారం ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించగా కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఊర్మిళ దేవి పర్యవేక్షించారు.వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సలాది సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.