నేటి నుంచి 'గండి'లో శ్రావణమాసోత్సవాలు నాలుగు శనివారాలపాటు ప్రత్యేక పూజలు
చక్రాయపేట : పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో పాపాగ్ని నది ఒడ్డున వెలసిన గండిక్షేత్రంలోని వీరాంజనేయ స్వామి శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 నుంచి అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అసి ిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి, ఆలయ చైర్మన్ పినుబోలు రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 19న మొదటి, 26న రెండవ, సెప్టెంబర్ 2న మూడవ, 9న నాల్గవ శ్రావణ శనివారాల్లో ఉత్సవాలుంటాయన్నారు.
ఎత్తైన కొండల నడుమ పాపాగ్ని..
. ఆలయానికి సమీపంలోనే సుమారు 2 వేల అడుగుల ఎత్తైన కొండల నడుమ పాపాగ్ని నది ప్రవహిస్తూ ఉంటూంది. ఈ సుదర దృశ్యం పలువురిని ఆకట్టుకుంటోంది. గండి క్షేత్రం తీర్థాలలో పాపాగ్ని తీర్థం అతి పవిత్రంగా భావిస్తారు. దత్త మండలాలు ఉన్నప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన థామస్ మన్రో విదేశీ యువకుడైనా, భారతీయ సంస్కతి గురించి అవగాహన లేకపోయినా పవిత్ర హద యుడుగా ఉండేవారు. అందుకే అతనికి గండి క్షేత్రంలోని స్వర్ణ విజయతోరణం దర్శనం ఇచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. .
పాపాగ్ని నదిలో స్నానాలు ఆచరించి అంజన్నను దర్శిస్తే మంచిదంటారు. పాపాగ్ని నది కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా నందిగాను పుట్టి సుదీర్ఘంగా అనంతపురం జిల్లాలో వ్యాపించి చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాలోకి చేరి పాపాకిలోకి ప్రవహించిన గండి అంజన్న పాదాల వద్ద ప్రవహిస్తూ సంగమేశ్వర వద్ద పెన్నా నదిలో అంతర్భాగమవుతుందని చరిత్ర చెబుతోంది.
గండికి అంజన్న క్షేత్రానికి చేరుకోవాలంటే..
గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకోవాలంటే తిరుపతి నుంచి పీలేరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే కర్నూలు నుంచి వచ్చే భక్తులకు కడప మీదుగా వేంపల్లి, రామాపురం ,లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట, మీదుగా గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. అనంతపురం నుంచి వచ్చే వారికి పులివెందల మీదుగా వేంపల్లి, గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. జమ్మలమడుగు నుంచి ప్రొద్దు టూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి మీదుగా గండికి చేరుకోవచ్చు. ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా అత్యధిక సంఖ్యలో యాత్రికులు శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు.
స్వామివారి అలంకరణకు తమిళనాడు రాష్ట్రం అంబూరు నుంచి ప్రత్యేక పూల అలంకరణ చేయించారు. ఆలయం, పరిసర ప్రాం తాల్లో ప్రత్యేక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. యాత్రికులకు సౌకర్యంగా క్యూలైన్లు, తాగునీరు, దాతలచే నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. స్నానం చేయడానికి నదిలో బోర్లు వేయించి షవర్లు ఏర్పాటు చేశారు. సాంస్కతిక కార్యక్రమాలను టిటిడి వారి సౌజన్యంతో ఒక పెద్ద జర్మని షెడ్డు నిర్మించారు. మొబైల్ టాయిలెట్లు, చలువ పందిళ్లు, పోలీస్ అవుట్‌పోస్టు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలు కల్పించారు. యాత్రికుల కాలక్షేపానికి పౌరాణిక నాటకాలు, భరతనాట్యం, తోలుబొమ్మలాటలు, చెక్కభజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. వేంపల్లె వైపు నుంచి వచ్చే యాత్రికులకు వీరన్నగట్టుపల్లె నుంచి, రాయచోటి నుంచి వచ్చే వారికి అద్దాల మర్రిక్రాస్ నుంచి గండి క్షేత్రానికి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న ఆలయం










