అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి
ఘనంగా నిర్వహించేలా చర్యలు
ప్రజాశక్తి - ముసునూరు
మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖాధికారుల సమన్వయ కృషితో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తల్లాప్రగడ విశ్వేశరరావు, సర్పంచి రావుప్రవీణ్‌సుధాకర్, కమీటి అధ్యక్షు లు నాగుల నాగేశ్వరరావు తెలిపారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ ఆపూర్వభరత్ పర్వవేక్షణలో ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేశామన్నారు. యాత్రికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారుల, నేతల సమన్వయంతో, స్వచ్ఛంద సంస్థల సేవా సహకారాలతో ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నోడల్ అధికారి (తహాశీల్దార్) దాసరి సుధ, ఎంపిడిఒ జి.రాణి తెలి పారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే లక్షలాది యాత్రికులకు ఎటు వంటి అసౌకర్యం కలగ కుండా జల్లు స్నానాలు, మహిళ భక్తుల కు ప్రత్యేక వస్త్ర మార్పిడి గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దైవ దర్శనానికి క్యూలైన్లు, ఉత్సవ ప్రాంగణంలో ప్ర సాద కౌంటర్లు, మంచినీ రు అందించే ప్రదేశంలో మహిళ సిబ్బందితో రద్దీని నివారిం చేలా ఏర్పాట్లు చేసిన్నటు తెలిపారు. భక్తులకు అత్యవసర చికిత్స ఆందిం చేందుకు వైద్య సిబ్బంది కూడా మూడు రోజుల పాటు 24 గంట లు మూడు షిఫ్ట్‌లగా అందుబాటులో ఉంటారన్నా రు. డిఎస్ పి అశోక్‌కుమార్‌గౌడ్, సిఐ ఆర్.అంకబాబు ఆధ్వర్యంలో కట్టుదిట్ట మైనభద్రత చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ ఎం.కుటుంబరావు తెలిపారు.










