Oct 29,2022 23:40

సమావేశంలో మాట్లాడుతున్న బొండా తౌడన్న

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన బహుజన సాంస్కృతిక చైతన్య ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలియజేశారు. అసోసియేషన్‌ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో అధ్యక్షులు బొండా తౌడన్న మాట్లాడుతూ, ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల్లో చైతన్యాన్ని కలుగజేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌పై సంఘం శరణం గచ్చామి రూపకల్పన 30వ తేదీన, ఇదే రూపకల్పన 31వ తేదీన హిందీలో, మహాత్మ జ్యోతిబా ఫూలే జీవితంపై రూపకల్పనను నవంబర్‌ ఒకటో తేదీన ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌భట్‌, సిజిఎం (హెచ్‌ఆర్‌) కె.శ్రీనివాసరావు, క్రైమ్‌ ఎడిసిపి గంగాధరం, గుర్తింపు యూనియన్‌ నాయకులు డి.ఆదినారాయణ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ సత్యనారాయణ, బయ్యే మల్లయ్య, ఎం.గణేష్‌, జి.వేణుగోపాలరావు, డి.పుల్లయ్య, ఎల్‌వి.రమణారావు, వి.లక్ష్మణమూర్తి, డి.అప్పారావు, ఎస్‌.మోహన్‌బాబు, ఎం.పైడికొండలరావు, జి.ఫణింద్రబాబు, భజన కిషోర్‌ సింగ్‌, కెవి.రత్నం, బీడీ నాయక్‌ పాల్గొన్నారు.