ప్రజాశక్తి - ఆదోని
నేటి బాలలే రేపటి పౌరులని వక్తలు పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆదోనిలోని మాతా శిశు చిన్న పిల్లల ఆస్పత్రిలో 125 మంది బాలింతలకు, గర్భిణులకు పోషకాహార కిట్లు పంపిణీ చేసినట్లు ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కాకుబాళ్ నగేష్ తెలిపారు. అవోపా పట్టణ అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్తా, కార్యదర్శి మిర్యాల శ్రీధర్, ఉపాధ్యక్షులు ప్రతాప్, ఈరన్న శెట్టి, రాంప్రసాద్, రంగా, బుశెట్టి సురేష్, అవోపా మహిళా విభాగం కార్యదర్శి వంకదారు మమతాశ్రీ, నారాయణ, నరసయ్య, ప్రవీణ్, రాముడు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని తిరుమల్ నగర్‌లో ఉన్న అమరావతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ రాజేశ్వరి ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు చిన్నారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని కరస్పాండెంట్ గుడిసె రామకృష్ణ తెలిపారు. అలాగే పట్టణంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో నేషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కౌతాళం పట్టణంలోని ప్రతిభ హైస్కూల్‌లో నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపిడిఒ సుబ్బరాజు హాజరయి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి, సెక్రటరీ సయ్యద్ మైనుద్దీన్, పర్యవేక్షకులు జయలక్ష్మి, భీమేష్, రాజు, ఉపాధ్యాయులు రామలక్ష్మి, శిరీష, ముంతాజ్, పరమేష్, సునీల్, శ్రీను, లలిత, పుష్ప, కళావతి, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్ పాల్గొన్నారు. ఆస్పరిలో నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజేత స్కూల్ కరస్పాండెట్ మల్లేష్, ధనలక్ష్మి, నారాయణ ప్రైమ్ స్కూల్ కరస్పాండెట్ నరేష్ ఆచారి, రెక్టర్ దీప్తి, నోబుల్ స్కూల్ కరస్పాండెట్ చంద్ర శేఖర్ మాట్లాడారు. విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించామని తెలిపారు. పిల్లలు వివిధ వేషధారణలతో ప్రత్యేక ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు జమ్సర్ వలీ, ఖలీల్, బాలరాజు, మహేష్, సతీష్, ఈశ్వర్, నీలకంఠ, అంజి, రేష్మ, పద్మావతి, శ్రీదేవి, గంగమ్మ పాల్గొన్నారు. కోసిగి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈనెల 9న జెవివి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్, జెవివి జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య పాల్గొన్నారు. ఆలూరు మండలంలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ ఆశ్రమ బాలుర, గిరిజన గురుకుల బాలికల, 4వ వార్డు ఎంపిపి పాఠశాలలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జంబులింగయ్య, జమ్మన్న, షాహినూర్ బాలల దినోత్సవ సందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన పిల్లల ప్రత్యేక సంచిక స్నేహ చిరుమువ్వలు పుస్తకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు అందజేశారు. బాలల కోసం ప్రజాశక్తి ప్రత్యేక సంచికను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాశక్తి విలేకరి కృష్ణ పాల్గొన్నారు.