Jan 23,2023 23:53

నేతాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎఎంఎఎల్‌ ప్రిన్సిపాల్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని సోమవారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తగరపువలస : స్థానిక సంగివలస అనిల్‌ నీరుకొండ ఇంజినీరింగ్‌ కళాశాలలో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె రామకృష్ణ మాట్లాడుతూ, సుభాష్‌ చంద్ర బోస్‌ త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, కేర్‌టేకర్‌ కె.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.
జివిఎంసి ఒకటో వార్డు పరిధి బంగ్లా మెట్ట ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యాన, జివిఎంసి పిఎనెం ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి ఆధ్వర్యాన, స్థానిక ప్రభుత్వ డైట్‌లో నేతాజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరిపంచారు. ఆయా కార్యక్రమాల్లో ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షులు కెఎస్‌ఆర్‌.కృష్ణారావు, గౌరవాధ్యక్షులు గంటా నూకరాజు, డైట్‌ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సిరిపురం : బీచ్‌ రోడ్డులోని నేతాజీ విగ్రహానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బమ్మిడి ప్రియాంక, అల్లిపిల్లి శశి, సత్తి లక్ష్మి, రౌతు రూప, మైలుపల్లి ఆనంద్‌, మిరియాల రఘువీర్‌ తదిత్వాలు పాల్గొన్నారు.
పద్మనాభం : పద్మనాభం పంచాయతీ పరిధిలోని ఇసుకలపాలెం ఆంగనవాడీకేంద్రంలో నేతాజీ చిత్రపటానికి రూపాకుల రవికుమార్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎపి వైద్య విభాగం, రూపాకుల విశాలాక్షి చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా విద్యార్థులకు పలకలు, పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పి.విద్యామోహన్‌, బి.మహేశ్వరరావు, బి.రత్నాలు, యు.అప్పారావు, ఆర్‌.శ్రీనివాసరావు, పాలూరి కృష్ణారావు పాల్గొన్నారు.
కంచరపాలెం : కంచరపాలెం మెట్టు వద్ద ఉన్న నేతాజీ విగ్రహానికి ఉత్తర నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త కెకె.రాజు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కటుమూరి సతీష్‌, కెవిఎన్‌ శశికళ, నాయకులు కాయిత వెంకటలక్ష్మీరత్నాకర్‌, గంగామహేష్‌, వై.సిద్దార్థ, ఎర్రంశెట్టి శ్రీను, సొండి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు
సింహాచలం: సింహాచలంలోని లైబ్రరీ వద్ద గ్రంథాలయాధికారి నరసింహ ఆధ్వర్యాన నేతాజీ జయంతిని నిర్వహించారు.
ఎంవిపి.కాలనీ : ఆర్‌కె.బీచ్‌లోని నేతాజీ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు జివిఎల్‌.నరసింహారావు, విశాఖ బిజెపి అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి పూలమాల వేసి నివాళులర్పించారు.
నక్కపల్లి : మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి జనార్దన్‌ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అప్పలరాజు, సిహెచ్‌ రాజు పాల్గొన్నారు .
అనకాపల్లి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి కార్యక్రమం సోమవారం ఏఎంఏఎల్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి జయ బాబు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతాజీ జీవిత విశేషాలను వివరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం హరిబాబు, ఐక్యు ఏసి కోఆర్డినేటర్‌ టి నిరంజన్‌ కుమార్‌, కళాశాల సూపరింటెండెంట్‌ అనురాధ, డాక్టర్‌ సౌజన్య, మోహిని, విద్యార్థులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం వద్ద రన్‌ వే హోటల్‌ వద్ద నేతాజీ సుభాష్‌ చంద్రబోష్‌ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ పొన్నగంటి అప్పారావు నేతాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెంచాడు గంగరాజు పాల్గొన్నారు