రాయచోటి టౌన్ : నేరస్తులను శిక్ష పడేలా చూడాలని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్‌పి డాక్టర్ వి.బి.రాజ్ కమల్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కోర్టు పనులు చూసే పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు విచారణ సమయంలో ఆధారాలు పక్కాగా ఉండే విధంగా చూసుకోవాలని కోర్టులో చాట్ షీట్ దాఖలు చేసిన వెంటనే సిసి, పిఆర్‌సి నంబర్లు తీసుకోవాలని సమన్లను సకాలంలో అందజేయాలని, సాక్షులకు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా ప్రోత్సహించలని అన్నారు. సాక్షుల వాంగ్మూలం లేదా సాంకేతికత వైద్య ఆధారాలను సేకరించి వాటిని సరైన పద్ధతిలో కోర్టుకు సమర్పించాలన్నారు. సంబంధిత జడ్జితో సత్సంబంధాలు కొనసాగించి ఆయా కేసులలో నేరస్తులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. వారెంట్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని రోజూ క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లి అక్కడ జరుగుతున్న ప్రాసెస్ సీసీడీలు సమన్లు వారెంట్స్ కోర్టు డిస్పోజల్ అడ్వకేట్ తదితర సమాచారాన్ని సిసిటిఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. కోర్టుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ సంబంధిత స్టేషన్ ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు. నేరస్తులకు శిక్ష పడడంలో కోర్టు పనులు చూసే సిబ్బంది విధులు చాలా కీలకంగా ఉండాలని పోలీస్ స్టేషన్‌కు న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ అంకిత భావంతో పనిచేస్తూ శిక్ష పడే శాతాన్ని పెంచే విధంగా శ్రమించాలని అన్నారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు శిక్షపడే శాతం పెరిగినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని నేర రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో డిసిఆర్‌బి సిఐ రాజేంద్రప్రసాద్, డిసిఆర్‌బి ఎస్‌ఐలు పాల్గొన్నారు.










