నేరాలు తగ్గుముఖం చేపట్టాలి: డిఎస్‌పి
నేరాలు తగ్గుముఖం చేపట్టాలి: డిఎస్‌పి
ప్రజాశక్తి -బంగారుపాళ్యం: నేరాలు తగ్గు ముఖం కావాలని పలమనేరు డిఎస్‌పి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల సంఖ్యను అధికం కాకుండా చూసేందుకు పోలీసు వ్యవస్థ విధులు చేపట్టాలని కేసులు నమోదు చేసేటప్పుడు నిజ నిర్థారణ లు అయిన తర్వాత వాటికి సరిపడే సెక్షన్లతో కేసులు నమోదు చేయాలని పాత కేసులు పరిశీలించి పరిష్కారమయ్యేవి చేయించి కేసులు పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. అనంతరం పలు రికార్డులను పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు ఎస్సై రాంభూపాల్ , ఏఎస్‌ఐలు మల్లప్ప, రామచంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గజేంద్ర, పురుషోత్తం అస్గర్, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










