మదనపల్లె అర్బన్ ; నేరాల నియంత్రణపై ప్రత్యేక దష్టి సారించి, పాత నేరస్తులపై నిఘా ఉంచి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి డిఎస్‌పి కె. కేశప్ప తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు ఆదేశాల ఆదివారం డిఎస్‌పి కార్యాలయంలో సబ్ డివిజన్ స్థాయిలోని అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు తెలియజేశారు. 2019 సంవత్సరం నుంచి 13 ఎన్‌డిపిఎస్ కేసులలో 44 మంది ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచి షీట్స్ ఓపెన్ చేశామని తెలియజేశారు. పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో గంజాయి విక్రయం దారుల గురించి ప్రత్యేక నిఘా ఉంచామని వారిపై ఇప్పటివరకు కేసులు నమోదు చేసి రౌడీషీట్స్ ఓపెన్ చేశామని చెప్పారు. ఫోక్సో కేసులకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు సాంకేతికపరమైనటు వంటి ఆధారాలు కూడా సేకరించి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేస్తున్నామని పేర్కొన్నారు. హత్య కేసులకు సంబంధించి కూడా నేరస్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేస్తున్నామని అక్రమ నాటుసారా, కర్ణాటక అక్రమ మద్యం విక్రయదారులను గుర్తించి వారిని అరెస్టు చేశామని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి అక్రమ మద్యం వినియోగదారులపై షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. సమావేశంలో మదనపల్లి టూ టౌన్ సిఐ ఎస్ .మురళీకష్ణ, వన్ టౌన్ సిఐ .మహబూబ్ బాషా, రూరల్ సర్కిల్ సిఐ శివాంజనేయులు , సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, కోర్టు సిబ్బంది, రైటర్లు పాల్గొన్నారు.










