అనంతపురం క్రైం : జిల్లాలో నేరాల నియంత్రణపై ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ అన్బురాజన్ డీఎస్పీలకు సూచించారు. జిల్లాలోని డీఎస్పీలతో బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఛీటింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటిపై దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు వేసి కోర్టుల్లో నెంబర్లు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో ఏవైనా పూర్తి కాకుండా ఉంటే వెంటనే వాటి దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాల కేసులను ప్రాధాన్యతగా తీసుకుని ఛేదించడంతో పాటు రికవరీలు కూడా పెంచాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు సిఎం గంగయ్య, యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, బివి.శివారెడ్డి పాల్గొన్నారు.