Aug 05,2023 23:37

ప్రజాశక్తి- కాకినాడ కార్పొరేషన్‌ నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్‌ డిఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారులు పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో గత మూడేళ్లతో పోలిస్తే గడిచిన 6 నెలల కాలంలో నేరాలు గణనీయంగా తగ్గాయని ఎస్‌పి సతీష్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో రోడ్డుప్రమాదాలు, పోక్సో, ప్రాపర్టీ నేరాలు తగ్గాయన్నారు. సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సైబర్‌, లోన్‌యాప్‌, బ్యాంక్‌ ఫ్రాడ్స్‌, అకౌంట్‌ హ్యాకింగ్స్‌పై ప్రత్యేక దష్టి సారించి వారధి కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం హైవే రాబరీ, ఇతర ప్రాపర్టీ కేసుల్లో రివకరీలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు డిఐజి ప్రసంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఎఎస్‌పిలు పి.శ్రీనివాస్‌, ప్రేమ్‌ కాజల్‌, డిఎస్‌పిలు మురళీకృష్ణారెడ్డి, లతాకుమారి, రాంబాబు, అప్పారావు పాల్గొన్నారు.